ఏడాదిగా నయవంచక పాలన!

Saturday, May 23rd, 2015, 03:55:31 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతున్నారని, సీఎంగా చేసిన తొలి సంతకాలలో ఒక్కటీ అమలు చెయ్యలేదని మండిపడ్డారు. అలాగే చంద్రబాబు ఏడాది పాలన నయవంచనతో సాగిందని అంబటి నిప్పులు చెరిగారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు ప్రచారం కోసం ఇచ్చే ప్రాధాన్యం అభివృద్ధిపై పెడితే మంచిదని సూచించారు. అలాగే జూన్ 2న నవనిర్మాణ దీక్షను ఉత్సవ దినంగా ఎందుకు పాటించాలని అంబటి నిలదీశారు. ఇక ఆ రోజును ఉత్సవ దినంగా కంటే నయవంచన దినంగా పాటిస్తే బాగుంటుందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.