అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!

Tuesday, June 30th, 2020, 12:33:48 AM IST


ఏపీ టీడీపీ నేత జీవీ ఆంజనేయులుకు వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. తాను 4 లక్షల రూపాయలకు పొలం కొని 20 లక్షలకు అమ్మినట్టు ఆరోపణలు చేస్తున్నారని, అది నిజమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

అయితే 10 ఏళ్ళు వినుకొండకు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వడం నీకు చేతకాలేదని, వినుకొండకి ఇళ్ల స్థలాలు 2.7 కిలోమీటర్లు మాత్రమే ఉంటే 7 కిలోమీటర్లు అంటూ అసత్య ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నా మీద చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే మీడియా ముందు నిరూపించాలని, మీ ఇంట్లో అయినా, మీ పార్టీ ఆఫీస్‌లో అయినా డిబేట్‌కి నేను సిద్దమని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఛాలెంజ్ చేశారు. అయితే గతంలో రేషన్ మాఫీయాకు వినుకొండను కేంద్రంగా మార్చి వేల కోట్ల రేషన్ బియ్యం చైనాకి పోర్టు ద్వారా పంపించింది నిజం కాదా అని జీవీనీ నిలదీశారు.