హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానే.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Monday, May 10th, 2021, 08:39:46 PM IST

ఏపీ నుంచి కరోనా రోగులతో వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి రానివ్వడంలేదు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు అంబులెన్సులను అడ్డుకుంటున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవని చెబుతూ కరోనా పేషంట్లున్న అంబులెన్సులను వెనక్కి పంపించేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మెరుగైన వైద్యం కోసం ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. అయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానే అని, ఇంకా మూడేళ్ల వ్యవధి ఉందని గుర్తుచేశారు. కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, అంబులెన్స్‌లు ఆపటం నిజంగా అనైతికమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి, దీనిపై పునరాలోచాన చేయాలని సామినేని కోరారు.