ప్రధాని నరేంద్ర మోదీపై సాంగ్ విడుదల చేసిన వైసీపీ ఎంపీ..!

Tuesday, June 30th, 2020, 02:12:12 AM IST


ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీపై ఓ సాంగ్ విడుదల చేశాడు. అయితే ‘జయం మనది.. జయం మనది.. జయం మనదిరా.. నవభారత రథసారథి మోదీ సారథ్యంలో అంటూ ఓ సాంగ్‌ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహార శైలి కూడా పార్టీలో ఎవరికి నచ్చడం లేదు. తాజాగా ఇలా ప్రధాని మోదీపై పాట రిలీజ్ చేయడం చూస్తుంటే ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది.