19 రాష్ట్రాల్లో సున్నా కరోనా మరణాలు

Tuesday, March 2nd, 2021, 04:30:26 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో మెల్లగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో పాటుగా మృతుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. అయితే తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం 19 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం లో సున్నా మరణాలు సంభవించాయి.పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, బీహార్, లక్షద్వీప, లడాక్, సిక్కిం, త్రిపుర,మణిపూర్, మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు, దయ్యూడమన్ దాద్రానగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్ లలో సున్నా మరణాలు సంభవించాయి.

అయితే గడిచిన 24 గంటల్లో 91 మరణాలు సంభవించాయి. అయితే వీటి లో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రికవరీ ల సంఖ్య పెరుగుతూనే ఉండటం గమనార్హం. అంతేకాక ఇప్పటి వరకు కోటిన్నర మందికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.