వంద మంది భార్యలు, వెయ్యి మంది పిల్లలు.. ఓ ముసలోడి టార్గెట్ ఇదేనట..!

Thursday, May 13th, 2021, 11:40:17 PM IST

సాధారణంగా ఒక వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోడం లేదంటే ముగ్గురిని పెళ్లి చేసుకోడం మహా అయితే ఓ పది మందిని పెళ్ళి చేసుకున్నాడన్న వార్తలను మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఓ ముసలోడు మాత్రం ఏకంగా 100 పెళ్ళిలు చేసుకుంటానని శబధం చేసి చెబుతున్నాడు. అంతేకాదండోయి 1000 మంది సంతానాన్ని పొందడం కూడా తన లక్ష్యమని చెబుతున్నాడు.

అయితే అసలు వివరాల్లోకి వెళితే జింబాంబ్వేకు చెందిన 66 ఏళ్ల మిషెక్ న్యాన్‌డోరో ఓ మాజీ సైనికుడు. ఈయన 1983లోనే పెళ్లి, పిల్లల్ని కనడంపై దృష్టి పెట్టాడు. అయితే ఇప్పటికే 16 మంది భార్యలు, 151 మంది పిల్లలను కలిగి ఉన్నాడు. కానీ 100 మంది భార్యలు, 1000 మంది పిల్లలను పొందడమే తన లక్ష్యమని అతగాడు చెబుతున్నాడు. అయితే తన ప్రాణం పోయేలోపు ఈ బహు భార్యత్వం ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే ప్రయత్నాల్లోనే ఉంటానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఇతగాడు పదహేడో పెళ్లికి సిద్దమయ్యాడు.