లాక్ డౌన్ రివ్యూ : వర్క్ ఫ్రమ్ హోమ్ మోటివేషన్ ఎలా?(యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్)

నిడివి : 10 నిమిషాల 4 సెకన్లు
ఛానెల్ : వైరల్లీ(తమడా మీడియా)

దేని కోసం.?

ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ మూలాన ప్రతీ ఒక్కరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో నుంచే ఆఫీస్ వర్క్ చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఈ లాక్ డౌన్ సమయంలో ఎలా చేసారు?దీని ద్వారా ఏం చెప్పాలి అనుకున్నారు అన్నది అసలు విషయం.

ఏం బాగుంది?

ఈ “వర్క్ ఫ్రమ్ హోమ్ మోటివేషన్ ఎలా?” అనే షార్ట్ ఫిల్మ్ కు చాలా మందే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. అలాగే ఈ వర్క్ ఫ్రమ్ వల్ల ఎదుర్కొనే ఫ్రస్ట్రేషన్ అలాగే జాబ్ వదిలేద్దామా వద్దా అనే డైలమా వంటివి బాగా చూపించారు.

ఏం బాగోలేదు?

ఈ షార్ట్ ఫిల్మ్ కొంచెం సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా తాను ఆ జాబ్ వదిలేయాలా లేదా అన్న విషయంలో తన ఫ్రెండ్స్ తో మాట్లాడే సీక్వెన్స్ అలా అనిపిస్తాయి.

ఫైనల్ తీర్పు :

“వర్క్ ఫ్రమ్ హోమ్ మోటివేషన్ ఎలా?” అనే ఈ షార్ట్ ఫిల్మ్ కు ఇప్పుడున్న సిట్యుయేషన్ లో చాలా మందే కనెక్ట్ అవుతారు. వాటికితోడు ఓమాదిరిగా నవ్వుకోడానికి ఈ లాక్ డౌన్ లో చూడొచ్చు.

రేటింగ్ : 3/5