నిడివి: 11:35
ఛానల్: వైరల్లీ/తమడ మీడియా
కాన్సెప్ట్:
లాక్‌డౌన్‌కి ముందు మనలో చాలా మందికి వంట చేయడం రాదు. ఎప్పుడూ కూడా స్విగ్గీ మరియు జొమాటో ఆన్లైన్ పుడ్ డెలివరీల మీదే ఆధారపడేవారు. అయితే ప్రతి ఒక్కరికి చేసేందుకు వచ్చే వంటకం మ్యాగీ ఒక్కటే. ఒకవేళ వంట చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది కాస్త డిజాస్టర్ అయ్యేది. అయితే నాకు వంట రాదు అనే కాన్సెప్ట్‌పై ఫోకస్ పెట్టి ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి ఎంటర్టైన్ అందించారు.
ప్లస్ పాయింట్స్:
ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం చాలా వినోదాత్మకంగా మరియు హాస్యంతో నిండి ఉంది. నాకు వంట రాదు అనే కాన్సెప్ట్ నిత్యం మనకు కనిపించే కథనే, ముఖ్యంగా ఇది అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఇందులో మంచి విషయం ఏమిటంటే స్వతంత్ర మహిళ మనుగడ సాగించడానికి వంట ఒక్కటే వస్తే పనికిరాదని ఇచ్చిన సందేశం బాగుందనే చెప్పాలి.
మైనస్ పాయింట్స్:
ఇందులో మైనస్ ఏమీ లేదు కానీ పెద్దగా ఎంటర్టైన్గా మాత్రం లేదు అనే చెప్పాలి.
తుది తీర్పు:
మంచి హాస్యం కావాలంటే “నాకు వంట రాదు” వీడియోను తప్పక చూడండి. లాక్డౌన్ ముందు వంట రాక మీరు పడిన ఇబ్బందులు ఓ సారి గుర్తు చేసుకోండి.
Rating : 4/5