లాక్ డౌన్ రివ్యూ : ఒక వైపే చూడు (యూ ట్యూబ్ లఘు చిత్రం)

Oka-Vaipe-Chudu

నిడివి : 11:58 నిమిషాలు
ఛానెల్ : వైరల్లీ / తమడ మీడియా

కాన్సెప్ట్ :
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒకసారైనా గడ్డానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దానిని ట్రిమ్ చేసేప్పుడు మాత్రం ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ట్రిమ్మర్ల తో ఏదో ఒక సమయం లో నైనా మనం ఇబ్బంది పడి ఉంటాం. ఫలితంగా ఒక కొత్త రకమైన స్టైలే తో పాడవుతుంది. అయితే ఒక వైపే చూడు లఘు చిత్రం ఈ సమస్యలను సరిగ్గా చూపించింది.

ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రం లో రవి తన గడ్డాన్ని సగం చేసుకొని ఉన్నపుడు, అతని స్నేహితుడు లోపలికి వచ్చినపుడు వచ్చే హాస్యం చాలా బావుంటుంది. తన ట్రిమ్మర్ ను ఉపయోగించే విధానం, చాలా హాస్యం గా ఉంటుంది.

మైనస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రం లో ఒకానొక సన్నివేశం వద్ద బోరింగ్ గా అనిపిస్తుంది. చివర్లో ఇది ఇంకా ఎక్కువ గా ఉంటుంది.

తుది తీర్పు:
ఈ ఒక వైపే చూడు లఘు చిత్రం చాలా హాస్యం గా, మనకి రిలేటివ్ గా అనిపిస్తుంది. మీ మూడ్ బాగోలేక పోతే ఈ చిత్రం చూడండి, లేదంటే కాస్త సమయం దొరికినా ఇది చూడండి, కానీ చూడటం మాత్రం మిస్ కావద్దు. ఇది చాలా హాస్యాస్పదం గా కొనసాగుతుంది.

రేటింగ్: 3.5 /5