మూవీ రివ్యూ : “విజిల్”

ఇళయ దళపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా విజయ్ హిట్టు చిత్రాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “బిగిల్”. ఈ చిత్రాన్ని తెలుగులో “విజిల్” పేరిట ఈ రోజే విడుదల చేసారు.అటు తమిళ్ మరియు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ అంచనాలను సంతరించుకొని విడుదల అయ్యింది.ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్ ఉంది.మరి ఆ మ్యాజిక్ ఈ చిత్రంతో మళ్ళీ రిపీట్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే మైఖేల్(విజయ్) ఒక ఫుట్ బాల్ ప్లేయర్.కానీ కొన్ని అనుకోని ఊహించని పరిణామాల చేత తాను బలంగా అనుకున్న లక్ష్యానికి దూరం అయ్యిపోతాడు.అయితే ఇదే నేపథ్యంలో కొంత కాలం తర్వాత ఒక మహిళా ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా నియమించబడతాడు.ఇలా నియమించబడ్డ విజయ్ ఏం చేసాడు? అసలు ఈ సినిమాలో “బిగిల్” అనే పాత్రకు, ఏజ్డ్ విజయ్ కు ఈ మైఖేల్ కు ఉన్న సంబంధం ఏమిటి?ఇద్దరి స్టోరీనా లేక ఒకరి స్టోరీనే ఇద్దరిలా తీసారా వాటన్నిటిని అట్లీ ఎలా తెరకెక్కించారు అన్న అన్ని ప్రశ్నలకు సమాధానం తెల్సుకోవాలి అంటే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

అట్లీ మరియు విజయ్ ల కాంబినేషన్ లో ఇప్పటికే మనం కొన్ని సినిమాలను చూసాం.ఇద్దరి నుంచి ఫుష్కలమైన యాక్షన్ సీన్స్ మరియు మంచి ఎమోషనల్ సీన్స్ ను ప్రేక్షకులు తప్పకుండా ఆశిస్తారు.ఏ విధంగా ఈ చిత్రంలో కూడా ఉన్నాయి కానీ ఆ ఎమోషన్స్ అన్ని కాస్త రొటీన్ గా అనిపిస్తుంది.అలాగే సినిమా నిడివి పెద్దది కావడం వల్ల ఫస్ట్ హాఫ్ లో కాస్త మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయమే తీసుకున్నట్టు అనిపిస్తుంది.

దీనిపై అట్లీ ఇంకా బాగా స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది.కానీ ఫస్ట్ హాఫ్ లోని ప్రీ ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.అయితే అట్లీ విజయ్ తో చేసిన రెండు సినిమాల ద్వారా కూడా మంచి ఎమోషన్స్ ను పండించారు.అలా ఈ సినిమాలో కూడా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఇప్పటికే ఈ ఇద్దరి కాంబో అలాంటి ఎమోషన్స్ చూసేసాం కాబట్టి కాస్త కొత్తగా అనిపించకపోవచ్చు.

ఇక సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం అట్లీ దర్శకత్వాన్ని మెచ్చుకొని తీరాలి.ఫస్ట్ హాఫ్ లో సోసో గా కథనం అనిపించినా సెకండాఫ్ లో మాత్రం చాలా ఆసక్తికరంగా మలిచారు.లేడీస్ ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ నియమించబడిన తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది.ఒక పక్క ఎమోషన్స్ తో పాటుగా మంచి కామెడీని కూడా క్యారీ చేస్తూ వచ్చారు.

అప్పటి వరకు కథలోని డెప్త్ లేదని కోరుకునే వారికి మెల్లగా అట్లీ తన కథనం ద్వారా కథలోకి లీనం చేస్తారు.ఇది మంచి పాయింట్ అని చెప్పాలి.అలాగే ఫుట్ బాల్ మ్యాచెస్ కానీ అద్భుతంగా ఉంటాయి.అలాగే సమాజంలో ఆడవారు పడుతున్న బాధలు ఇబ్బందులు వాటిని వారు అధిగమించే తీరు అలా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో ఒక మధ్య వయస్కుడిలా అలాగే ఫుట్ బాల్ ప్లేయర్ గా మరియు కోచ్ గా విజయ్ అదిరిపోయే నటన కనబర్చారు.కీలకమైన ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ లో పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి.అలాగే నయన్ కూడా మంచి నటన కనబరిచింది.తమిళ్ బిజీ కమెడియన్ యోగి బాబు మరియు వివేక్ ల కామెడీ ట్రాక్స్ బాగున్నాయి.అంతే కాకుండా నెగిటివ్ రోల్ లో కనిపించిన జాకీ ష్రాఫ్ మంచి నటన కనబరిచారు.

ఇక దర్శకుడు అట్లీ విషయానికి వస్తే ఎక్కడా తగ్గించడానికి అని కాదు కానీ కథలో అంత కొత్తదనం అనిపించదు.తాను తియ్యాలి అనుకున్నదాని అభిమానులకు సగటు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తీశారు.కానీ దాని కోసం సినిమాను కొన్ని అనవసరమైన సన్నివేశాలతో(ఇప్పటికే కొన్ని సినిమాల్లో చూసిన విధంగా) నింపి పెద్ద సినిమా చేసేసారు.సెకండాఫ్ లో చూపిన శ్రద్ధ అట్లీ ఫస్ట్ హాఫ్ లోనే తీసుకొని ఉంటే ఒక రెండున్నర గంటల్లో మరింత అద్భుతంగా ఈ చిత్రం వచ్చి ఉండేది.

అలాగే ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా కొన్ని కొన్ని కీలక సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే జి కె విష్ణు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ విషయంలో నిర్మాత మహేష్ కోనేరు అందించిన నిర్మాణ విలువకు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ అద్భుత నటన

బ్యాక్గ్రౌండ్ స్కోర్

సెకండాఫ్

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం లేకపోవడం

సినిమా నిడివి

ఫస్ట్ హాఫ్

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే విజయ్ మరియు అట్లీ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సందేశాత్మక స్పోర్ట్స్ డ్రామా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఒకే అనిపించినా సెకండాఫ్ మాత్రం బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది.మంచి మాస్ ఎలివేషన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఎమోషన్స్ మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ కు తప్పకుండ కనెక్ట్ అవుతాయి.కథను పెద్దగా పట్టించుకోనట్టయితే మాత్రం “విజిల్” సినిమా మీకు చూసేందుకు ఈ వారాంతంలో మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

Rating : 3/5