దూకుడు పెంచుతాం : ధోని

Tuesday, December 16th, 2014, 05:05:46 PM IST


మొదటి టెస్ట్ లో భారత్ ఓటమి పాలయినప్పటికీ… పోరాటపటిమ అందరినీ ఆకట్టుకున్నది. సాంప్రదాయక టెస్ట్ కు విరుద్దంగా దూకుడుగా ఆడింది. గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. కాగ.. ఇక రెండో టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. మొదటి టెస్ట్ కు గాయం కారణంగా దూరంగా ఉన్న ధోని.. రెండో టెస్ట్ కు అందుబాటులోకి రానున్నారు.
రెండో టెస్ట్ లోను అదే దూకుడును ప్రదర్శిస్తామని మహేంద్ర సింగ్ ధోని తెలియజేశారు. రెండో టెస్ట్ ను తప్పకుండా గెలుస్తామని అన్నారు. ఇక సోమవారం సిడ్నీ ఉదంతం అనంతరం రేపు జరిగే బ్రిస్బేన్ టెస్ట్ కు భారీ బధ్రతను పెంచారు. మ్యాచ్ జరిగే స్టేడియంకు లోపలా బయటా కూడా సెక్యూరిటీని పెంచినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.