8వ ప్లేస్ తో సరి

Sunday, October 5th, 2014, 11:46:27 AM IST


దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో 14 రోజులపాటు జరిగిన 17వ ఆసియా క్రీడలు ఘంగంగా ముగిశాయి. భారత్ ఈ టోర్నిలో మొత్తం 11 స్వర్ణపతకాలు సాధించి.. 8వ స్థానంతో సరిపెట్టుకున్నది. గత ఏషియాడ్ లో భారత్ 7వ స్థానం దక్కించుకాగా ఈ సారి మాత్రం 8వ స్థానం దక్కించుకున్నది.
చివరిరోజు కబడ్డీలో భారత్ పురుషుల, మహిళల జట్లు స్వర్ణపతకాలు సాధించాయి. దీంతో మొత్తం 11 స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకున్నది.
ఈ టోర్నిలో భారత్ 11 స్వర్ణపతకాలు, 9 రజత పతకాలు, 37 కాంస్యపతకాలు సాధించి పతకాల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.. 16 సంవత్సరాల అనంతరం.. భారత పురుషుల హాకీ జట్టు చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి.. స్వర్ణపతకం సాధించడం ఈ టోర్నీకే హైలైట్ అని చెప్పవచ్చు.