475పరుగులకు ఇండియా ఆల్ అవుట్!

Friday, January 9th, 2015, 10:27:45 AM IST


ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 475 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పతనమైన దగ్గరనుండి టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. దీనితో 475 పరుగుల వద్ద భారత జట్టు ఆల్ అవుట్ అయ్యి 97 పరుగుల ఫాలో ఆన్ లో పడిపోయింది. ఇక వెనువెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసిస్ జట్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కాగా తొలి ఓవర్ లోనే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ను పెవిలియన్ దారి పట్టించాడు. ఇక ప్రస్తుతం రెండో వికెట్ ను కూడా కోల్పోయిన ఆస్ట్రేలియా 56పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది.