ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టారు

Friday, December 5th, 2014, 11:48:31 PM IST


ఆస్ట్రేలియా టూర్ లో భారత క్రికెటర్లు విజయపధంలో దూసుకేళ్తున్నారు. ఆస్ట్రేలియా XI తో జరిగిన రెండో రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత సీమర్లు రాచిచడంతో ఆస్ట్రేలియా XI జట్టు కేవలం 68.3 ఓవర్లలో 243పరుగులకే ఆల్ ఔట్ అయింది. బౌలింగ్ లో వరుణ్ ఆరోన్, కరణ్ శర్మ లు రాణించారు. అటు బ్యాటింగ్ లోను భారత బ్యాట్స్ మెన్లు రాణించి 340పరుగులకు పాగా పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యుస్ మృతికి సంతాప చిహ్నంగా రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇక ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఈ నెల నాలుగున జరగవలసిన మొదటి టెస్ట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగ ఈ నెల 9నుంచి రెండు జట్ల మధ్య ఆడిలైడ్ లో మొదటి టెస్ట్ జరగనున్నది. ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలర్లు, బ్యాట్స్ మెన్లు రాణించడంతో భారత్ నైతికంగా ఆస్ట్రేలియాపై పైచేయి సాధించింది.