దక్షిణ కొరియాలో జరుగుతున్న 17వ ఆసియా క్రీడలలో భారత్ మరో స్వర్ణం గెలుచుకున్నది. బాక్సింగ్ 51కేజీల విభాగంలో మూడు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకామ్ ఫైనల్ లో కజికిస్తాన్ కు చెందిన జైనా షెకర్ పై విజయం సాధించింది. బారత్ కు ఇది ఏడో స్వర్ణం. కాగ, భారత్ ఇప్పటి వరకు 7 స్వర్ణాలు, 8 రజతాలు మరియు 32 కాంస్యపతకాలు సాధించింది.. పతకాల పట్టికలో భారత్ పదోస్థానంలో నిలిచింది.
మేరీకామ్ స్వర్ణం గెలవడం పట్ల ప్రియాంక చోప్రా హర్షం వ్యక్తం చేసింది. మేరీకామ్ స్వర్ణం గెలవడం దేశానికే గర్వకారణమని అన్నది.