భారత్-పాక్ మ్యాచ్ కు భలే క్రేజు!

Tuesday, February 3rd, 2015, 04:46:46 PM IST


క్రికెట్ అభిమానులను ఊరిస్తూ ప్రపంచ కప్ 2015 అత్యంత సమీపానికి వచ్చేసింది. కాగా వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 15 న ప్రత్యర్ధి దేశాలు ఇండియా-పాకిస్థాన్ ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు సర్వత్రా ఆత్రంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అమ్మకానికి పెట్టిన టికెట్లు కేవలం 20నిమిషాలలో అమ్ముడు కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక పరోక్షంగా దాదాపు 130కోట్ల మంది అభిమానులు టీవీలలో ఈ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో పరాజయాన్ని చవి చూడని భారత జట్టు మరి ఈ సంవత్సరం జరిగే మ్యాచ్ లో ఏ విధంగా తన ఆటతీరును ప్రదర్శిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 15 వరకు వేచి చూడాల్సిందే.