ఐపీఎల్-2021కి సంబంధించి బీసీసీఐ సన్నాహాల మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు రిటైన్ ఆటగాళ్ల పేర్లను, వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి సమర్పించాయి. అయితే తాజాగా ఈ సీజన్‌కి సంబంధించి మినీ వేలం తేదీ, వేదికలు ఖరారయ్యింది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా మినీ వేలం నిర్విహించనున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ వేలంలో అత్యధిక డబ్బులతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బరిలో దిగనుంది. జట్ల వారిగా చూసుకుంటే కింగ్స్ ఎల్వెన్ పంజాబ్ వద్ద రూ.53.2 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.35.7 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.22.9 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.12.8 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.10.85 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.10.75 కోట్లు ఉన్నాయి.