బుల్లెట్ గురి తప్పలేదు

Sunday, September 21st, 2014, 11:42:55 AM IST


ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడలలో భారత షూటర్స్ పతకాల పంట పండిస్తున్నారు.మొదటి రోజు షూటర్ జీతూ రామ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణం సాధించారు. ఇక రెండో రోజు టీం ఈవెంట్ 10 మీటర్ల షూటింగ్ విభాగంలో భారత షూటర్స్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. ఇక మహిళల 10 మీటర్ల విభాగంలో శ్వేతాచౌదరి కాంస్యపతకం కైవసం చేసుకుంది. షూటింగ్ లో భారత క్రీడాకారులు పతకాలను సాధిస్తున్నారు.