ఐపిటిఎల్ హిట్ అవుతుంది: మహేష్ భూపతి

Monday, November 17th, 2014, 06:58:17 PM IST


2020వ సంవత్సరం నాటికి ఐపిటిఎల్ లో 8జట్లు పాల్గొనే విధంగా కృషి చేస్తామని ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి అన్నారు. చైనాతో సహా మొత్తం 8జట్లు పాల్గొనేదిశగా కృషిచేస్తామని ఆయన అన్నారు. ఐపిటిఎల్ నిర్వహణ బాధ్యతలను మహేష్ భూపతి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఈ 28నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28 నుంచి 30మధ్య మనీలాలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఇక డిసెంబర్ 2 నుంచి4 మధ్య సింగపూర్ లో, డిసెంబర్ 6 నుంచి 8 మధ్య ఢిల్లీలో అలాగే… 11 నుంచి 13 మధ్య దుబాయ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో మొత్తం 24మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లలో సానియా మీర్జా, సెరెనా విలియమ్స్, పీట్ సంప్రాస్, ఆండ్రి ఆగస్సీ, రోజర్ ఫెదరర్, జంకోవిచ్, అండీ ముర్రే తదితరులు పాల్గొననున్నారు. మొత్తం 40మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఈ మ్యాచ్ ల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నది.