స్వల్ఫ స్కోరును చేధించలేకపోయిన కోల్‌కతా.. ముంబై గ్రాండ్ విక్టరీ..!

Wednesday, April 14th, 2021, 01:08:10 AM IST


ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిజంగా మ్యాజిక్ జరిగిందనే చెప్పాలి. సునాయాసంగా కోల్‌కతా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నా 10 పరుగుల తేడాతో ముంబై గ్రాండ్ విక్టరీ నమోదు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సూర్య కుమార్ యాదవ్(56), కెప్టెన్ రోహిత్ శర్మ(43) పరుగులతో రాణించగా, మిగతా వారందరూ విఫలమయ్యారు. ఇక కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ ఐదు వికెట్లు తీసుకోగా, కమిన్స్ 2 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇక 153 పరుగుల మాములు లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్‌కతా్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్లు నితీష్ రానా(57), గిల్(33) పరుగులతో మంచి ఆరంభాన్ని ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన వారెవరు కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆఖరి ఓవర్లలో చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 4 వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటే, కేకేఆర్ మొదటి ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.