సంజూ శాంసన్ సెంచరీ వృథా.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే గెలుపు..!

Tuesday, April 13th, 2021, 01:00:49 AM IST


ఐపీఎల్ మ్యాచ్‌లు అంటేనే నరాలు తెగే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. ముంబై వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్‌-పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ఐపీఎల్ ప్రేక్షకులకు మంచి మజా ఇచ్చింది. ఆఖరి బంతి వరకు జరిగిన పోరాటంలో పంజాబ్ కింగ్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్‌ జట్టు ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91) అదరగొట్టగా, అతడికి క్రిస్ గేల్(40), దీపక్ హుడా(64) తోడై మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే డేంజరస్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మనన్ వోహ్రా(14) కూడా తొందరగానే ఔటైనా వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
జోస్ బట్లర్(25), శివమ్ దూబే(23), ర్యాన్ పరాగ్(25) కాస్త ధాటిగానే ఆడినా సంజూ శాంసన్‌కి సరైనా సహకారం అందిచకుండానే వెనుదిరిగారు. ఇక గతేడాది సిక్సర్లతో విరుచుకుపడిన రాహుల్ తెవాటియా(2) కూడా వెంటనే ఔట్ అయ్యాడు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న సంజూ శాంసన్ మాత్రం తన స్పీడును ఏ మాత్రం తగ్గించకుండా సెంచరీతో కదం తొక్కాడు. అలవోకగా బౌండరీలు బాదుతూ 18వ ఓవర్లోనే స్కోరును 200 దాటించాడు. దీంతో రాజస్థాన్ గెలుపునకు చేరువైంది.

అయితే 19వ ఓవర్ వేసిన పంజా బౌలర్ మెరిడిత్ కేవలం 8 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీయడంతో ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావల్సి వచ్చింది. అయితే చివరి ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండంతో అతడి ఓవర్లో కూడా కేవల్మ్ 8 పరుగులే వచ్చాయి. అయితే చివరి బంతికి 5 పరుగులు కావల్సి ఉన్న సమ్యంలో శాంసన్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించగా క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది.