అందరిని విప్పేయమన్నాడు..

Tuesday, February 3rd, 2015, 04:24:59 PM IST


టీం ఇండియా సాధించిన అద్బుతమైన విజయాలలో ఇంగ్లాండ్ లో 2002లో జరిగిన ముక్కోణపు సీరిస్ విజయం కూడా ఒకటి. ఇక, ఆసీరిస్ లో ఫైనల్ మ్యాచ్ ఇప్పటికీ ఎప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోతుంది. కాగా, ఆరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ విజయం అనంతరం అప్పటి కెప్టెన్ సౌరబ్ గంగూలి చొక్కా విప్పి గాలిలో తిప్పిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా, తనతో పాటు సహచరులైన ద్రావిడ్ ను, సచిన్ కూడా అలాగే చేయమని గంగూలి అడిగాడని, అందుకు వారు తిరష్కరించారని అప్పటి జట్టు కెప్టెన్ రాజేవ్ శుక్లా వివరించారు. ఫ్లింటాఫ్ కు సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే గంగూలి అటువంటి నిర్ణయానికి వచ్చినట్టు రాజీవ్ శుక్లా తెలిపారు.