ఫోటో మూమెంట్ : ఈ విదేశీ ఆటగాళ్ళు చాలా హాట్ గురూ

Saturday, May 14th, 2016, 06:12:56 PM IST

rcb
ఐపీఎల్ పుణ్యమా అని అన్ని దేశాల ఆటగాళ్ళ తల రాతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇండియా ప్రాంచైజీలు కోట్లు పెట్టి స్వదేశీ, విదేశీ అన్న తేడా లేకుండా ఆటగాళ్లను కొనేస్తో వాళ్ళను కోటీశ్వరులను చేస్తున్నారు. మరో వైపు భారతీయ మొబైల్, ఇతరత్రా కంపెనీలు భారత్ వచ్చి అందుబాటులో ఉన్న ఫేమస్ ప్లేయర్లను అడ్వర్టైజ్మెంట్లకు, ప్రమోషన్లకు వాడేసుకుంటూ వాళ్లకు భారీ మొత్తాల్లో ముట్ట చెబుతున్నాయి. ఆ దారిలోనే LYF అనే ప్రముఖ మొబైల్ కంపెనీ రాయల్ చాలెంజెర్స్ కు చెందిన విదేశీ ఆటగాళ్ళు గేల్, డివిలియర్స్, షేన్ వాట్సన్ లకు తలపాగాలు పెట్టి మరీ తమ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయించుకుంది. ఇలా విదేశీ ఆటగాళ్లంతా హాట్ కేకుల్లా చెలామణీ అవుతున్నారు.