రోహిత్ శర్మ అమ్మాయిగా కూడా భలే క్యూట్‌గా ఉన్నాడు..!

Friday, June 19th, 2020, 02:40:16 AM IST


భారత్ క్రికెటర్ రోహిత్ శర్మ, టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఒకరిపై ఒకరు ఎప్పుడూ పంచ్‌లు వేసుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా రోహిత్ శర్మ అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుందో ఓ ఫోటోను సృష్టించి చాహల్ ట్వీట్ చేశాడు.

అయితే రోహిత్ మాములుగానే కాదు అమ్మాయి గెటప్‌లో కూడా అదిరిపోయాడు. దీంతో రోహిత్ శర్మా భయ్యా అమ్మాయిలా కూడా చాలా అందంగా కనిపిస్తున్నావ్ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు చాహల్. అయితే ఈ ఫోటోలో అమ్మాయి నిజంగానే చాలా అందంగా ఉండడంతో దీనిపై రోహిత్ అభిమానులు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.