ముంబై లో జరగాల్సిన ఐపియల్ మ్యాచ్ ల పై క్లారిటీ ఇచ్చిన దాదా!

Tuesday, April 6th, 2021, 10:18:19 AM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ఇప్పటికే పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై లో జరగాల్సిన ఐపియల్ మ్యాచ్ ల పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే వాంఖడే స్టేడియం లో పదిమంది సిబ్బందికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారం ముంబై లో జరగాల్సిన మ్యాచ్ లను అక్కడే నిర్వహిస్తాం అని సౌరవ్ గంగూలీ తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగా నే జరుగుతాయి అని, ఒక్క సారి బాయో బబుల్ లోకి అడుగు పెడితే ఏ సమస్యా ఉండదు అని తెలిపారు.

అయితే యూ ఏ ఈ లో గత సీజన్ ఆరంభానికి ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అని, కానీ ఒక్కసారి టోర్నీ ఆరంభం అయ్యాక అంతా సర్దుకుంది అని వ్యాఖ్యానించారు. అయితే వాంఖడే లో మ్యాచ్ లు నిర్వహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని దాదా తెలిపారు. అయితే ఈ నెల 10 నుండి 25 వ తేదీ వరకు 10 మ్యాచు లే జరగనున్నాయి. బబుల్ లోపల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలిపారు. ఆటగాళ్లకు, సహాయ సిబ్బంది ఆరోగ్యానికి ఎలాంటి హని జరగదు అంటూ చెప్పుకొచ్చారు.