కరోనా పై పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం!

Monday, May 10th, 2021, 07:45:15 PM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే భారత్ ఇప్పుడు కరోనా ను సమర్థవతంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. పలువురు ప్రముఖులు తమకు తోచిన రీతిలో విరాళం అందిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ పై పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం ప్రకటించడం జరిగింది. కోవిడ్ 19 కట్టడికి తన వంతు సహాయం గా 30 కొట్ల రూపాయలను విరాళం గా అందజేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

అయితే భారత్ లో రెండవ దశ కరోనా విజృంభణ కి ప్రభావితం అయిన వారికి అండగా ఉండేందుకు 30 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నాం అని తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకి ఈ నిధులను చెల్లించనున్నాం అని తెలిపింది. అయితే ఆక్సిజన్ సిలిండర్లు, ఔషద సరఫరాల్లో ఎన్జీఓ లతో భాగస్వాములం అవుతాం అని చెప్పుకొచ్చింది. అంతేకాక ప్రసార మాధ్యమాల ద్వారా కరోనా వైరస్ కట్టడికి సంబందించిన అవగాహన కార్యక్రమాలు చేపడతాం అని తెలిపింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.