తన ప్లాప్ తో ఆల్ టైం రికార్డు సెట్ చేసిన అఖిల్..!

Tuesday, July 7th, 2020, 09:53:37 AM IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ హీరో అఖిల్. అయితే తాను హీరోగా పరిచయం అయ్యాక మొత్తం మూడు సినిమాలు తీసినా వాటిలో ఏ ఒక్కటీ హిట్ కాకపోవడం అక్కినేని అభిమానులను ఇంత గానో నిరాశపరిచిన అంశంగా మిగిలిపోయింది.

అయినప్పటికీ అఖిల్ సినిమాలకు మాత్రం మినిమం అంటే మినిమం బిజినెస్ జరుగుతుంది. అయితే తాను రీసెంట్ గా నటించిన చిత్రం “మిస్టర్ మజ్ను”. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచిపోయింది. కానీ అదే సినిమాను ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్ లో పెట్టగా దానికి ఆల్ టైం రికార్డ్ వ్యూస్ వచ్చినట్టుగా నిర్మాతలు చెప్తున్నారు.

ఈ చిత్రం కేవలం 40 గంటల్లోపే 20 మిలియన్ వ్యూస్ కి పైగా మరియు 6 లక్షలకి పైగా లైక్స్ కొల్లగొట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి హిందీలో అఖిల్ తన ప్లాప్ చిత్రంతో గట్టి రెస్పాన్స్ నే రాబట్టాడాని చెప్పాలి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.