అనుకున్న టైంకే “అల వైకుంఠపురములో”.!

Friday, July 31st, 2020, 10:09:16 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే మలయాళం లో టెలికాస్ట్ అయ్యి రికార్డు స్థాయి టీఆర్పీ రాబట్టింది అలాగే కన్నడలో కూడా “ఇదే వైకుంఠపురము” అనే టైటిల్ తో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది. ఇక ఇదిలా ఉండగా మన తెలుగులో మాత్రం ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం అతి త్వరలోనే టెలికాస్ట్ కానుంది అని జెమినీ టీవీ వారు తెలిపారు.

ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ చిత్రాన్ని వచ్చే ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చెయ్యనున్నట్టుగా జెమినీ టీవీ వారు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఏ స్థాయి టీఆర్పీ కొడుతుందో చూడాలి.