బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ రవికృష్ణకు కరోనా పాజిటివ్..!

Sunday, July 5th, 2020, 01:00:54 AM IST


బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ రవికృష్ణకు కరోనా సోకింది. ఇప్పటికే ప్రభాకర్, నవ్య మొదలగు నటులకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవికృష్ణ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇటీవల తానూ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలిందని, దీనితో గత మూడు రోజులు నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లుగా తెలిపాడు. అయితే ఆగిపోయిన బుల్లితెర, వెండితెర షూటింగ్‌లకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడంతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక రవికృష్ణ, నవ్య కలిసి ఒకే సీరియల్ లో కలిసి నటిస్తున్నారు. ఆ సీరియల్‌ నుంచి ఇద్దరు నటులు కరోనా బారిన పడటంతో మిగిలిన చిత్ర యూనిట్ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుంది.