బ్రేకింగ్ న్యూస్ : “బిగ్ బాస్ సీజన్ 3” ఆఫీసియల్ ఫైనల్ లిస్ట్ ఇదే.!?

Sunday, July 21st, 2019, 02:41:50 PM IST

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఇప్పుడు “బిగ్ బాస్ 3” కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు.ఎన్నో రోజుల నిరీక్షణకు ఈ రోజు తెర పడబోతున్నా సరే ఈ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు మాత్రం అధికారికంగా ఎక్కడా బయటకు రాలేదు.కానీ చాలా మంది పేర్లు అయితే రిపీటెడ్ గా వినిపించేవి.అయితే ఇప్పుడు మాత్రం ఈ రోజు రాత్రి ప్రారంభం కాబోయే ఈ షోలో ఎవరెవరు కనిపించబోతున్నారు అన్న విషయానికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.ఇదే ఆఫీసియల్ లిస్ట్ అని ఈ లిస్ట్ లో ఉండే 15 మందే 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండబోయే వారని తెలుస్తుంది.ఓ సారి లిస్ట్ ను మనం పరిశీలిద్దాం.

1. యాంకర్ శ్రీముఖి
2. సింగర్ రాహుల్ సిప్లిగంజ్
3. హీరో వరుణ్ సందేశ్
4. వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు
5. టీవీ 9 యాంకర్ జాఫర్
6. హీరోయిన్ పునర్నవి భూపాలం.
7. మూవీ ఆర్టిస్ట్ హేమ
8. మూవీ ఆర్టిస్ట్ హిమజా
9. సీరియల్ ఆర్టిస్ట్ రోహిణి
10. డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్
11. సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ
12. సీరియల్ ఆర్టిస్ట్ అలీ రెజా
13. ఫన్‌ బకెట్ మహేష్
14. వి 6 యాంకర్ సావిత్రి
15. డబ్ స్మాష్ ఫేమ్ జూనియర్ సమంత(అషు రెడ్డి)

ఈ 15 మందే ఈ రోజు రాత్రి బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయనున్నారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే ఫైనల్ లిస్ట్ అవునో కాదో ఈ రోజు రాత్రి వరకు వేచి చూడాల్సిందే.