రాజ్ తరుణ్ సినిమాకు అంత సీన్ వచ్చిందా.?

Sunday, June 28th, 2020, 06:55:57 PM IST

యువ హీరోగా కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అతి తక్కువ మంది హీరోల్లో అందులోను పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని వారు చాలా తక్కువ అలాంటి వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ సబ్జెక్టులతో మంచి విజయాలను అందుకున్న అతను తర్వాత మంచి హిట్ కోసం చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఎంతలా అంటే అతని సినిమా వస్తుంది అంటే మినిమం హైప్ కూడా ఇప్పుడు నమోదు కావడం లేదు. అయినప్పటికీ మంచి దర్శకులే అతనితో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. “గుండె జారి గల్లంతయ్యిందే” లాంటి సినిమాను తీసిన విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఒరేయ్ బుజ్జిగా”.

ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నైర్ మరియు హెబా పటేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కూడా కరోనా కారణం వల్ల ఆగిపోయింది. అప్పటికే పెద్ద అంచనాలను నెలకొల్పుకోలేని ఈ చిత్రానికి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ 7 కోట్లు ఆఫర్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికే అంత బడ్జెట్ అయ్యి ఉండదు. కాబట్టి అంత ఆఫర్ అనేది చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. కానీ అంత ఆఫర్ వచ్చేంత సీన్ అయితే ఈ చిత్రానికి లేదని చెప్పాలి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.