బంపర్ ఆఫర్: ఆ రెండు రోజులు ఉచితంగా నెట్‌ప్లిక్స్..!

Saturday, November 21st, 2020, 02:16:24 AM IST

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్‌ప్లిక్స్ ఓ బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఇందులోని వీడియోలను చూసేందుకు వీలు ఉంటుంది. అయితే నెట్‌ప్లిక్స్ శ్త్రేంఫెస్త్ పేరుతో భారత్‌లో రెండు రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ కల్పిస్తున్నట్టు తెలిపింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది.

అయితే ఈ రెండు రోజులు ఎలాంటి కార్డు నెంబర్ ఎంటర్ చేయకపోయినా ఉచితంగా నెట్‌ప్లిక్స్ యాక్సెస్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ 48 గంటల పాటు వినియోగదారులు తమ ఇష్టం వచ్చిన వీడియో, వెబ్ సిరీస్, సినిమా, లైవ్ షో ఏదైనా ఉచితంగానే చూడవచ్చని తెలిపింది. అయితే యూజర్లు ముందుగా తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలని, ఆ తర్వాత 48 గంటల పాటు ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చని చెప్పుకొచ్చింది.