మరో భాషలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “సరిలేరు నీకెవ్వరు”.!

Sunday, July 5th, 2020, 06:01:18 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పవర్ ఫుల్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రం భారీ ఒక్క వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పై కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే తెలుగులో రెండు సార్లు టెలికాస్ట్ కాబడ్డ ఈ చిత్రం మలయాళ భాషలో డబ్ అయ్యి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కు రెడి అయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం మరో భాషలో కూడా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

ఈసారి కన్నడ భాషల్లో “మేజర్ అజయ్ కృష్ణ” అనే పేరిట వచ్చే జూలై 11 న ఈ చిత్రం ప్రసారం అయ్యేందుకు రెడి అవుతుంది. ఇలా మొత్తం మూడు భాషల్లో టెలికాస్ట్ అవుతున్న ఈ చిత్రం అతి త్వరలోనే తమిళ్ భాషలో కూడా టెలికాస్ట్ కానున్నట్టు తెలుస్తోంది.