ఈటీవీలో తన ఆల్ టైం హిట్ షో తో సాయి కుమార్ ఈజ్ బ్యాక్..!

Tuesday, July 7th, 2020, 01:52:06 PM IST

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే షోలు మన తెలుగులో ఉండే ఇతర ఛానెల్ల షోలతో పోలిస్తే కాస్త యూనిక్ గా మరియు అతీతంగా ఉంటాయని చెప్పాలి. అలాంటి ఎన్నో ఆల్ టైం హిట్ షోలలో టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు బుల్లితెరపై సెన్సేషనల్ యాంకర్ సాయి కుమార్ వ్యాఖ్యాతగా చేసిన కిర్రాక్ షో “వావ్”.

మొత్తం రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ కిక్కిచ్చే గేమ్ షో ఇప్పుడు మూడో సారి మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడి అవుతుంది. మొత్తం నలుగురు సెలెబ్రెటీలు నాలుగు రౌండ్స్ 10 లక్షల క్యాష్ ప్రైజ్ తో ఈ షో అతి త్వరలో టెలికాస్ట్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే ఈటీవీలో దీని తాలూకా టీజర్ ప్రోమో కూడా టెలికాస్ట్ అవుతుంది. సో ఇక ముందు నుంచి ఈటీవీలో మరింత అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ రావడం ఖాయం అని చెప్పాలి.