సాయి కుమార్ అదిరిపోయే షో మళ్ళీ మొదలు కానుందా.?

Sunday, June 28th, 2020, 10:57:19 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో సాయి కుమార్ కు స్మాల్ స్క్రీన్ పై కూడా మంచి క్రేజ్ ఉంది. తాను హోస్ట్ గా ఇప్పటికే పలు షోలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి ఎంటర్టైనింగ్ షోలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఈటీవీ ఛానెల్లో సాయి కుమార్ హోస్ట్ చేసిన షోలలో “వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో” కూడా ఒకటి.

ఇప్పటికి రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో రెండు సార్లూ సూపర్ హిట్ అయ్యింది. అలాంటి ఈ షో ఇప్పుడు మూడో సీజన్ తో రానున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ మూడో సీజన్ మొదలు కానుందని ఇప్పుడు సమాచారం. ప్రస్తుతం సాయి కుమార్ ఈటీవీ ఛానెల్లో “మనం” అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ షో చేస్తున్నారు. మరి ఈ వావ్ మూడో సీజన్ ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి.