మహేష్ రెండో టెలికాస్ట్ కనీసం ఇంతైనా కొడతాడట.!

Sunday, June 28th, 2020, 07:18:27 PM IST

టాలీవుడ్ సూపర్ టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రం మన తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఆల్ టైం తరపు రికార్డు అందుకుంది. మళ్ళీ ఇప్పుడు డిలీటెడ్ సీన్స్ మరియు మరింత హై క్వాలిటీ సౌండ్ తో రెండో టెలికాస్ట్ జెమినీ టీవీ వారు సాయంత్రం 6:30 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. దీనితో ఈసారి కూడా మహెహ్ భారీ టీఆర్పీ రికార్డు కొట్టడం ఖాయం అని సినీ ట్రాకర్స్ అంటున్నారు.

మొదటి సారి 23.4 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ కొల్లగొట్టగా రెండో టెలికాస్ట్ లో మాత్రం మినిమమ్ 15 టీఆర్పీ పాయింట్స్ కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎలాగో ఈసారి మరిన్ని కొత్త సన్నివేశాలు మరియు ఆడియో కూడా ఒరిజినల్ తో టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.