బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్ సుమ..!

Sunday, November 8th, 2020, 04:30:56 PM IST

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 నెమ్మదిగా ఊపందుకుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు హౌస్‌లోని సభ్యులకు కనెక్ట్ అవుతూ వస్తున్నారు. దీంతో షో రేటింగ్ మరింత పెంచేందుకు నిర్వాహకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాలను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కరోనా మహమ్మారి చాలా మార్పులు తీసుకొచ్చిందని అందుకే ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా హౌజ్‌లోకి వెళ్లబోతున్నట్లు సుమ నాగార్జునతో చెప్పింది.

ఇక సుమ హౌస్‌లోని సభ్యులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్వించింది. అంతేకాదు నేను లోపలికి వస్తున్నా అని సుమ అనడం, నాగ్ ఆమెను దగ్గరుండి హౌస్ లోపలికి పంపించి ఆల్ ద్ బెస్ట్ చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం బయట పలు షోలతో ఎంతో బిజీ బిజీగా ఉన్న సుమ నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిందా? లేక షోలో భాగంగా ఇది నిర్వాహకుల ఎత్తుగడనా అనేది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ తప్పక చూడాల్సిందే.