వరల్డ్ రికార్డ్ సెట్ చేసిన సుశాంత్ సింగ్ ఆఖరి సినిమా.!

Tuesday, July 7th, 2020, 08:00:16 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా యావత్తు భారత దేశంలోనే ఫిల్మ్ లవర్స్ ని ఎంత గానో బాధించింది. దీనితో అతని చివరి సినిమా ను అతని కెరీర్ లొనే కాకుండా ఇండియన్ హిస్టరీలో నే ఒక చరిత్రగా నిలిపేయాలని మన భారత సినీ ప్రేముకులు ఆముకుంటున్నారు.

అలా తాను నటించిన చివరి చిత్రం “దిల్ బెచారా”ను ఉన్నత శికరాల్లో ఉంచే దిశగా నిన్న విడుదల కాబడిన ట్రైలర్ తో రికార్డులు నెలకొల్పుతున్నారు. అలా ఈ ట్రైలర్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వరల్డ్ రికార్డు అందుకొని చరిత్రలో నిలిచింది అని చెప్పాలి. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మాత్రమే కాకుండా మొత్తం మన ప్రపంచంలోనే ఏ ట్రైలర్ పై రానాన్ని లైక్స్ వచ్చాయి.

ఈ చిత్రం ట్రైలర్ కేవలం 90 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ అందుకొని రికార్డును నెలకొల్పింది. ఇది ఒక వరల్డ్ రికార్డు అని తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ చిత్రాన్ని ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నమోదు చేయాలని మన వాళ్ళు అంతా గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో కేవలం 15 గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ కు పైగా 5 మిలియన్ లైక్స్ కు పైగా రాబట్టింది.