హిస్సార్ లో యుద్దవాతావరణం

Tuesday, November 18th, 2014, 03:12:56 PM IST


హర్యానా హైకోర్ట్ ఉత్తర్వులతో బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు హిస్సార్ లోని ఆయన ఆశ్రమానికి వచ్చారు. రాంపాల్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై రాంపాల్ అనుచరులు నాటు బాంబులు… రాళ్ళతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రాంపాల్ అనుచరులు రాళ్ళు రువ్వడంతో అక్కడ న్యూస్ ను కవర్ చేస్తున కొన్ని టీవీ చానల్స్ జర్నలిస్టులకు గాయాలయ్యాయి.

ఈ సంఘన జరిగిన వెంటనే… హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే… సోమవారం హర్యానా పంజాబ్ హైకోర్ట్ బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరచాలని.. ఇందుకోసం శుక్రవారం వరకు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఆదేశాల మేరకు ఈ రోజు పోలీసులు బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా… బాబా అనుచరులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో 12మంది పోలీసులకు గాయాలయ్యాయి.